Sun Mar 30 2025 11:20:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఏపీ గవర్నర్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లింపును నిలిపేయాలని ఆయనలేఖలో కోరారు. సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. తమ అనుయాయులకు బిల్లులు చెల్లించడానికి లబ్దిదారుల సొమ్మును వాడుకుంటుందని తెలిపారు.
బిల్లులు చెల్లింపును నిలిపేయాలని...
ఈ బిల్లుల చెల్లింపును నిలిపేయాంటూ చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖలో కోరారు. ఆపద్ధర్మప్రభుత్వం తమ అనుచరులైన కాంట్రాక్టర్లకు బిల్లులను చెల్లిస్తుందని, దీనిని నిలిపేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖలో తెలిపారు. గవర్నర్ కు రాసిన లేఖను చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు కూడా చంద్రబాబు పంపారు. బిల్లులు చెల్లింపు నిలిపేయాలని కోరారు. డీజీపీకి కూడా ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారు. మాచర్ల, తాడిపత్రి, తిరుపతి ఘటనలపై నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచాలని కోరారు.
Next Story