Sun Dec 22 2024 18:25:56 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రాజశ్యామల యాగంతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చేందుకు రాజశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రచారంతో పాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో రాజశ్యామల యాగాన్ని నేడు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ఈ యాగంలో పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు...
నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.
Next Story