Thu Apr 03 2025 23:14:21 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య:చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా మర్డర్ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన తెలిపారు. పులివెందులలో మర్డర్ ప్లాన్ చేసి, ఇక్కడ మ్యానిఫేస్టో మీటింగ్ పెట్టారని చంద్రబాబు అన్నారు. అందరూ కలసి పెద్ద డ్రామా ఆడారన్నారు.
గుండెపోటు వచ్చిందంటూ...
అజయ్ కల్లాం లాంటి వారి చేత దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులకు దొరకకుండా ఆధారాలను కూడా తుడిచి పెట్టారని ఆయన అన్నారు. వివేకా మర్డర్ కేసులో చాలా మంది పాత్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. బాబాయ్ కు గుండెపోటు వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు.
Next Story