Fri Nov 15 2024 19:17:05 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎదుట చంద్రబాబు తరుపున న్యాయవాది సిద్ధార్థ లూధ్రా ఈ మెన్షన్ చేశారు. అయితే చంద్రచూడ్ మాత్రం ఎన్ని రోజుల నుంచి రిమాండ్ ఉన్నారని ప్రశ్నించారు. పదహారు రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నట్లు లూథ్రా తెలిపారు.
రేపు తెలియనుంది...
దీంతో రేపు మెన్షన్ లిస్ట్‌లో చేరుస్తామని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఎప్పుడు విచారించేది రేపు నిర్ణయిస్తామని తెలిపారు. దీంతో రేపు చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటీషన్ సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణకు రానుందీ రేపు తెలియనుంది. హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో చంద్రబాబు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Next Story