Mon Dec 23 2024 02:10:32 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu meets amitshah:అమిత్ షాను కలిసిన చంద్రబాబు
బీజేపీ సీనియర్ లీడర్ అమిత్ షా ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
Chandrababu meets amitshah:బీజేపీ సీనియర్ లీడర్ అమిత్ షా ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కలిశారు. చంద్రబాబు గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకోగా.. రాత్రి 8 గంటలకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. రాత్రి 10.30 గంటలకు అమిత్‌షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చర్చల్లో పాల్గొన్నారు. గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. మార్చి 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానున్న నేపథ్యంలో ఈ లోపే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది.
ఏపీలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసి పని చేయాలని చంద్రబాబు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఆయన అమిత్ షాను ఒకసారి కలిశారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ టూర్ లో పొత్తులపై మరోసారి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
Next Story