Mon Dec 15 2025 00:24:58 GMT+0000 (Coordinated Universal Time)
చీఫ్ జస్టిస్ ను కలిసిన చంద్రబాబు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో నోవాటెల్ లో బస చేసిన జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు. కొద్ది సేపు ముచ్చటించారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో చంద్రబాబు దాదాపు ఇరవై నిమిషాలు సమావేశమయ్యారు. ఆయనను శాలువతో సత్కరించారు.
అంతకు ముందు....
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశం 20 నిమిషాల పాటు సాగింది. హైకోర్టు నూతన భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన జస్టిస్ ఎన్వీరమణను కలిసి ఆయనతో ముచ్చటించారు. ఈ నెల 26వ తేదీన జస్టిస్ ఎన్వీరమణ పదవీ విరమణ చేస్తున్నారు.
Next Story

