Mon Dec 23 2024 04:30:11 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నా తొలిసంతకం దానిపైనే.. నన్ను నమ్మండి
మిధున్ రెడ్డిని ఓడిస్తేనే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం బాగుపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు
మిధున్ రెడ్డిని ఓడిస్తేనే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం బాగుపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేటలో వైసీపీకి ఓటు వేస్తే అరాచకం తప్ప అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపు నిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలసి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్ పై ఇప్పటికే జనంలో తిరుగుబాటు మొదలయిందన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీని ఏర్పాటు చేస్తామని, తన తొలి సంతకం దానిపైనే అని తెలిపారు.
కూటమి అభ్యర్థులను...
ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ఉద్యోగం వచ్చే వరకూ ప్రతి నెల నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. మహిళలను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. పేదలను లక్షాధికారులను చేయడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.
Next Story