Mon Dec 23 2024 07:46:51 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సీనియర్ల పేరు తొలి జాబితాలో గల్లంతు... కావాలనే చేశారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి సీనియర్లకు కూడా కొంత పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి సీనియర్లకు కూడా కొంత పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది. తొలి జాబితాలో సీనియర్ నేతల పేర్లు తొలి జాబితాలో లేకపోవడం ఒకింత ఆశ్చర్యకరమే. చావో రేవో తేల్చుకునే ఎన్నికలు కావడంతో కొందరు సీనియర్ నేతల పేర్లను కూడా పక్కన పెట్టారని చెబుతున్నారు. కొన్ని ఈక్వేషన్లు ఇంకా తేలకపోవడం వల్లనే సీనియర్ నేతలను తేల్చకుండా చంద్రబాబు తొలి జాబితాలో ప్రకటించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన ను పక్కనపెట్టేసినట్లే...
ఎచ్చర్ల నుంచి కళా వెంకట్రావు పేరు తొలి జాబితాలో లేదు. అక్కడ కొత్త వారిని ఎంపిక చేయాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. కళా వెంకట్రావుపై టీడీపీ లోకల్ క్యాడర్లో ఉన్న అసంతృప్తితో ఆయన పేరును తొలి జాబితా నుంచి డిలీట్ చేశారని తెలిసింది. మరొక కొత్త నేత పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగా సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా తొలి జాబితాలో లేదు. ఆయన వరస సర్వేపల్లి నుంచి పోటీ చేయడం, ఓటమి చవి చూస్తుడటంతో పక్కన పెట్టారంటున్నారు.
గురజాల సీటు...
సర్వేపల్లి స్థానానికి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించిన వారికి సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే సర్వేపల్లి స్థానానికి సోమిరెడ్డి పేరును ప్రకటించలేదని తెలిసింది. అలాగే గురజాల నియోజకవర్గం నుంచి యరపతినేని శ్రీనివాసరావు పేరు కూడా తొలి జాబితాలో కన్పించలేదు. అక్కడ వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్తి వచ్చే అవకాశమున్నందున ఆయనకు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఆపేరును ప్రకటించడం లేదంటున్నారు. వీలయితే యరపతినేని శ్రీనివాసరావును నరసరావుపేట నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
మైలవరం నుంచి...
మరో సీనియర్ నేత దేవినేని ఉమ పేరు కూడా తొలి జాబితాలో లేదు. మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో ఈ నెల 26వ తేదీన చేరే అవకాశముంది. అక్కడి నుంచి దేవినేని ఉమను పెనమలూరుకు షిఫ్ట్ చేయాలన్న యోచనలో ఉన్నారు. అందుకే మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమ పేరును ప్రకటించలేదని తెలిసింది. అలాగే మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా తొలి జాబితాలో చోటు దక్కపోవడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం. అక్కడ వంగవీటి రాధాను పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారని తెలిసింది. గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఈ జాబితాలో లేదు.
Next Story