Mon Dec 23 2024 02:47:31 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఎన్నికల అధికారికి చంద్రబాబు ఫోన్.. రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ
పింఛన్ల పంపిణీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల అధికారితో మాట్లాడారు
పింఛన్ల పంపిణీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల అధికారితో మాట్లాడారు. తర్వాత ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పింఛన్ల పంపిణీ విషయంలో రాజకీయ కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. రెండు కేటగిరీల కింద పింఛన్లను పంపిణీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. లబ్దిదారుల ఇళ్లవద్దనే పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు పింఛన్లపై కుట్ర పన్నారని తెలిపారు.
సొమ్ము లేకపోవడంతో...
పింఛన్ దారులకు ఇవ్వాల్సిన సొమ్మును కాంట్రాక్టర్లకు ఇవ్వడంతో ఖజానాలో సొమ్ములు లేవని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో ఇళ్లవద్దనే పింఛను ఇప్పించాలని ఎన్నికల కమిషన్ చెప్పిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముందే బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదని ఆయన లేఖలో తెలిపారు. నిధుల కొరత వల్లనే పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతుందన్నారు. ఎండలో వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లలేకపోతున్నారని, వెంటనే పింఛన్లను ఇంటి నుంచే ఇప్పించాలని ఆయన కోరారు.
Next Story