Tue Dec 24 2024 13:11:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఆళ్లగడ్డకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డకు రానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డకు రానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో రా కదలిరా కార్యక్రమం పేరుతో చంద్రబాబు బహిరంగ సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కనిగిరి, తిరువూరు, ఆచంట నియోజకవర్గాల్లో జరిగిన సభలు సక్సెస్ కావడంతో నేడు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఇక్కడ సీఈసీని కలిసిన అనంతరం నేరుగా హెలికాప్టర్ లో బయలుదేరి ఆళ్లగడ్డకు చేరుకుంటారు.
గంటన్నర సేపు...
నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆళ్లగడ్డలో సభ ఏర్పాట్లను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పర్యవేక్షిస్తున్నారు. భారీగా జనసమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గంటన్నర పాటు జరిగే ఈ సభలో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తే ఏం చేస్తామన్నదీ? ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కానుంది. ఆళ్లగడ్డలో పార్టీ గెలుపునకు అవసరమైన జోష్ చంద్రబాబు సభ ద్వారా లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Next Story