Thu Dec 19 2024 17:14:29 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు తూర్పుగోదావరి జిల్లాకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండో విడత ప్రజాగళం యాత్ర ప్రారంభం కానుంది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండో విడత ప్రజాగళం యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రజాగళం యాత్ర మరోసారి చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈరోజు కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.
ప్రజాగళం యాత్రలో...
ఏప్రిల్ 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజాగళం యాత్ర చేపడతారు. ఏప్రిల్ 6న పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఏప్రిల్ 7న పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story