Sun Dec 22 2024 18:25:23 GMT+0000 (Coordinated Universal Time)
9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 9వ తేదీన అమరావతిలో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. ఇప్పటికే ముహూర్తాన్ని చూసుకుని సమయాన్ని నిర్ణయిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
తాను నిర్మించ తలపెట్టిన రాజధాని అమరావతిలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి స్వింగ్ అయినట్లు కనిపిస్తుండటంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story