Mon Dec 23 2024 18:31:44 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఇంకొల్లుకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇంకొల్లులో జరిగే సభలో పాల్గొంటారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇంకొల్లులో జరిగే సభలో పాల్గొంటారు. రా కదలిరా పేరిట గత కొంత కాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న చంద్రబాబు గత కొద్ది రోజులుగా గ్యాప్ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికతో పాటు పొత్తుల విషయాలపై చర్చించేందుకు ఆయన గ్యాప్ తీసుకున్నారు.
రా కదలిరా..
మళ్లీ ఈరోజు ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు ఇంకొల్లుకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు చేశారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఈ సభకు హాజరు కానున్నారు.
Next Story