Mon Dec 23 2024 02:15:26 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నెల్లూరులో నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడంతో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
మూడు రోజుల నుంచి...
గత మూడు రోజుల నుంచి ఆమె పర్యటన సాగుతుంది. ఈరోజు నెల్లూరు, వెంకటగిరిలో నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. వారి కుటుంబ సభ్యలు వివరాలను అడిగి తెలుసుకుని తాము ఉన్నామని వారికి ధైర్యం కల్పించనున్నారు.
Next Story