Thu Apr 03 2025 18:23:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరినీ నిందించబోను : చంద్రబాబు
కందుకూరు జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను ఎవరినీ నిందించబోవడం లేదని

కందుకూరు జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను ఎవరినీ నిందించబోవడం లేదని చంద్రబాబు అన్నారు. దురదృష్టకరమైన ఘటన అని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్ షో ల ద్వారా ప్రజలకు చేరువవుదామని అనుకున్నానని అన్నారు. ఇరుకు రోడ్లలో మీటింగ్ లు పెట్టే ఆలోచన తనకు లేదన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తన సభలకు తరలి వస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలు ప్రజలు వస్తున్నారని అన్నారు.
అందరూ పెట్టినట్లుగానే...
కందుకూరులో ఎన్టీఆర్ జంక్షన్ వద్ద అన్ని పార్టీలూ మీటింగ్ లు గతంలో పెట్టాయని, తాము కూడా ఇక్కడే నిర్వహించామని తెలిపారు. దీనిపై కూడా విమర్శలు చేసేవారిని తాను ఏమీ చేయలేనని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఇది బాధాకరమైన ఘటన అని అన్నారు. పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుంటే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే తాను రోడ్ షోలను నిర్వహిస్తున్నానని చెప్పారు.
Next Story