Mon Dec 23 2024 19:27:56 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నేతలు కోలుకోలేని విధంగా దెబ్బతీశారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వ బాధితులేనని చంద్రబాబు చెప్పారు. 175 నియోజకవర్గాలు, 23 లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ ల వ్యవస్థలను ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. ఇంత దారుణమైన పాలన, ఇంత పెద్దగా రాష్ట్రం నష్టపోయింది ఎప్పుడూ జరగలేదన్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే కేసులు పెడుతున్నారన్నారు.
కొత్తేమీ కాదు....
అధికారం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదని చంద్రబాబు అన్నారు. జగన్ కు వ్యక్తిత్వం, విశ్వసనీయత లేదన్నారు. జగన్ రెడ్డి మూర్ఖపు నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారు. పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ గ్రహణం పట్టుకుందన్నారు. పింఛను మూడువేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాటమార్చారన్నారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో పేద విద్యార్థుల జీవితాలను నాశనం చేశారన్నారు. జ్ఞానం వల్లనే ఉద్యోగాలొస్తాయి కాని, భాష వల్ల కాదని చంద్రబాబు అన్నారు. మూడేళ్లలో ఒక్క పెట్టుబడి కూడా రాలేదన్నారు. వీళ్లను చూసి ఉన్న వాళ్లు కూడా పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
నలభై ఏళ్లవుతున్న.....
మార్చి 29వ తేదీకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్లు పూర్తవుతుందన్నారు. ఎన్టీఆర్ వందేళ్ల జయంతి ఉత్సవాలు కూడా రాబోతున్నాయన్నారు. ఆ సందర్బంగా పార్టీ పెద్దయెత్తున కార్యక్రమాలనను చేపడుతుందన్నారు. ఈరోజు ఐదో తారీఖని, ఈరోజుకు కూడా ఉద్యోగులకు జీతాలు రాలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే పరిస్థితి లేదు. ప్రజలు మరిచిపోయినా జగన్ రెడ్డిని చరిత్ర మర్చిపోతున్నారు. పార్టీకి గతంలో అండగా నిలిచిన వర్గాలను దరి చేర్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. స్థానిక అధికార పార్టీ నేతల అవినీతిని ఎండగట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Next Story