Thu Dec 26 2024 01:28:37 GMT+0000 (Coordinated Universal Time)
నా విజన్ ఏంటో తెలిసిందా?
ఏపీని నాలెడ్జ్ హబ్ చేసే క్రమంలో భాగంగా తమ విజన్ సత్ఫలితాలిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
అమరావతిలో తమ హయాంలో ఏర్పాటు చేసిన వీఐీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు టాప్ 15 ఎమర్జింగ్ ప్రయివేటు యూనివర్సిటీల జాబితాలో ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆ యూనివర్సిటీల యాజమాన్యాన్ని చంద్రబాబు అభినందించారు. అమరావతిలో స్థాపించిన ఈ రెండు యూనివర్సిటీలు టాప్ 15లో చోటుచేసుకోవడం మంచి పరిణామమని తెలిపారు. ఈ యూనివర్సిటీలు మొదటి, మూడో స్థానాలు దక్కించుకోవడం విశేషమని చెప్పారు.
రెండు యూనివర్సిటీలు..
ఏపీని నాలెడ్జ్ హబ్ చేసే క్రమంలో భాగంగా తమ విజన్ సత్ఫలితాలిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీలకు రోడ్డు కూడా వేయలేకపోయిందని, చెడిపోయిన రోడ్లను మరమ్మతులు చేయకుండా ఉందని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి మంచి చేయడం మానుకుని తన ప్రచారంపైనే దృష్టి పెట్టారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
Next Story