Mon Dec 23 2024 02:34:57 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పింఛన్లు పంచవద్దని మేం అన్నామా? చంద్రబాబు
పింఛన్ల విషయంలో ఈరోజు జరుగుతున్నదంతా పెద్ద రాజకీయ కుట్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
పింఛన్ల విషయంలో ఈరోజు జరుగుతున్నదంతా పెద్ద రాజకీయ కుట్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బందులు పెట్టే పాలకులు అవసరం లేదని అననారు. ప్రజల్లారా! కుట్రలను ఛేదించండి.. దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి అంటూ చంద్రబాబు పిలుపు నిచ్చారు.
అధికారంలోకి రాగానే
అధికారంలోకి రాగానే పింఛన్ నాలుగు వేల రూపాయలకు పెంచి ఇంటివద్దే అందిస్తామని తెలిపారు. పింఛన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని, తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ది పొందాలనేదే వైసీపీ నేతల ప్రయత్నం అని ఆయన అననారు. ఇంటింటికీ పింఛన్ ఇవ్వొద్దని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story