Sun Dec 22 2024 02:03:45 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు వస్తున్నారు.. ఆ తర్వాతే ఉండి టిక్కెట్ పై క్లారిటీ
ఉండి ఎమ్మెల్యే రామరాజు పై తనకు ప్రత్యేక అభిమానం ఉందని చంద్రబాబు అన్నారు
ఉండి ఎమ్మెల్యే రామరాజు పై తనకు ప్రత్యేక అభిమానం ఉందని చంద్రబాబు అన్నారు. రామరాజుకు న్యాయం ఎలా చేయాలా? అని ఆలోచిస్తున్నానని తెలిపారు. ఈరోజు ఢిల్లీ నుంచి ముగ్గురు బీజేపీ నేతలు వస్తున్నారని, వారితో చర్చించి ఉండి నియోజకవర్గం టిక్కెట్ పై త్వరలోనే స్పష్టత ఇస్తానని చంద్రబాబు తెలిపారు.
అన్యాయం జరగకుండా...
రామరాజుకు అన్యాయం జరగదని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో నేతలు త్యాగాలు చేయాల్సి రావడం సహజమని అన్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా అందరూ కలసి పనిచేయాలని, పట్టుదలలకు, పంతాలకు పోకుండా అధినాయకత్వం నిర్ణయానికి అనుకూలంగా ఉంటే భవిష్యత్ ఉంటుందని కూడా అన్నారు.
Next Story