Sun Dec 22 2024 20:18:38 GMT+0000 (Coordinated Universal Time)
అధికారంలో ఉంటే పోలవరం పూర్తయ్యేది
2024 వరకూ తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
2024 వరకూ తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పొన్నూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వాలంటీర్లను కాదని జగన్ కొత్త వ్యవస్థను తెస్తున్నారని టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కసిగా పనిచేయాలని కోరారు. రాష్ట్రానికి వైసీపీ శని వదిలేంత వరకూ శ్రమించాలని ఆయన పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.
ప్రశ్నిస్తే కేసులా?
ఇక జగన్ పాలనలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తే చాలు కేసులు పెడుతున్నారన్నారన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందించాలని చంద్రబాబు అన్నారు. తన పరిపాలనలో దర్గాలు, ఖబరస్థాన్, షాదీఖానాల మరమ్మతులకు నిధులను మంజూరు చేశానని, ఇప్పుడు మసీదు భూములను వక్ఫ్ బోర్డులను మార్చి వైసీపీ నేతలు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డు భూములను ఎమ్మెల్యే ముస్తాఫా లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం రాగానే వీరి సంగతి ఏంటో చూస్తాను అని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story