Fri Nov 22 2024 20:30:08 GMT+0000 (Coordinated Universal Time)
నమ్మకం లేకనే తెలంగాణకు వెళతామంటున్నారు
జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే విలీన గ్రామాల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే విలీన గ్రామాల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. ఇప్పటికీ తాగేందుకు నీరు లేదని, విద్యుత్తు సరఫరా అనేక చోట్ల పునరుద్ధరణ జరగలేదని చంద్రబాబు ఆరోపించారు. విలీన మండలాల్లో దాదాపు 14 రోజుల నుంచి విద్యుత్తు లేదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. అధికారులు వారిని పట్టించుకోక పోవడంతోనే వారు రోడ్డెక్కుతున్నారని అన్నారు.
వారం గడుస్తున్నా....
వరదలు తగ్గి వారం రోజులు అవుతున్నా విద్యుత్తు సరఫరాను ఎందుకు పునరుద్ధరించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. విలీన మండలాల్లో బాధితులకు ఇప్పటి వరకూ సాయం అందలేదన్నారు. అందుకే విలీన మండలాల్లోని ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అక్కడ ప్రజలు పడుతున్న అవస్థలను తెలుసుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ మటలు, గాలి పర్యటనలు మానుకోవాలని హితవు పలికారు.
Next Story