Tue Jan 07 2025 19:07:58 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ క్యాడర్ కు బాబు భరోసా
సైకోపాలన నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు వేచి చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
సైకోపాలన నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు వేచి చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనపర్తిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న అనపర్తి నియోజకవర్గం పర్యటలో నిబంధనలను అతిక్రమించి, పోలీసులపై దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు. కొందరు పోలీసు లాఠీఛార్జితో గాయాలపాలయ్యారు. నిన్న రాత్రి అనపర్తి దేవిచౌక్ లో బహిరంగ సభ ముగిసినా చంద్రబాబు మాత్రం అనపర్తిలోనే ఉండిపోయారు. జగన్ అక్రమాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరం లేదన్నారు.
వారికి పరామర్శ...
ఈరోజు గాయపడిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో పాటు అరెస్ట్ చేసిన పార్టీ నేతలను, కార్యకర్తలను వదిలిపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. సాక్షిలో గుమాస్తా దగ్గరుండి ఈ కేసులు పెట్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సైకో ముఖ్యమంత్రికి ప్రజలు గుణపాఠం చెబుతారని, తమ సభలకు జనం తరలివస్తుండటంతో ఓర్వలేక అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు.
Next Story