Tue Dec 24 2024 12:51:07 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతాం వైసీపీని భూస్థాపితం చేస్తాం
మరో యాభై రోజుల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
మరో యాభై రోజుల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అవుతుందని అన్నారు. వైసీపీకి ఇవే చివరి రోజులని చంద్రబాబు అన్నారు. ఇంకొల్లులో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ను తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతామని అని అన్న చంద్రబాబు అన్నారు. ఓడిపోయే ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే పోలీసులు మునిగిపోతారంటూ చంద్రబు హెచ్చరించారు.
ఓడించడానికి సిద్ధం...
ప్రజలు వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న చంద్రబాబు ఎన్నికలు రాకముందే టీడీపీ గెలుపు ఖాయమయిందన్నారు. జగన్ కు అభ్యర్థులు దొరకడం లేదని అన్న చంద్రబాబు, ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్టయిందన్నారు. ఈ ప్రభుత్వం తీరుతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారన్నారు. వ్యాపారులను కూడా వదిలి పెట్టలేదన్నారు. ఆంబోతుల మాదిరిగా ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, వాటిని నమ్మవద్దని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story