Mon Dec 23 2024 08:18:14 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పింఛనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలే
పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం చేసిన హత్యలే పెన్షనర్ల మరణాలు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 30న పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కానీ పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. పెన్షన్ల అంశంలో రాజకీయాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు అన్నారు. వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
శవ రాజకీయాలు చేయడం...
మనం చేసే పనుల వల్ల ఓట్లు అడగాలని ఆయన అన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి బెదిరించడం దారుణమని చంద్రబాబు అన్నారు. శవ రాజకీయాలు వైసీపీ మానుకోవాలని ఆయన కోరారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించారని, బాబాయ్ ని చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారన్న చంద్రబాబు కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. ఓడిపోతామని తెలిసి రూ.13 వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారన్న చంద్రబాబు పింఛన్లు ఇవ్వాలంటే ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి కదా అని ప్రశ్నించారు.
పింఛన్లు పంపిణీ చేయవద్దని...
ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయవద్దని ని ఈసీ ఎక్కడా చెప్పలేదన్నారు. వాలంటీర్లను ఎన్నికల కోసం ఉపయోగించాలని పన్నాగం పన్నారని, వాలంటీర్ వ్యవస్థను తామూ కొనసాగిస్తామన్న చంద్రబాబు వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారన్నారు. మీ స్వార్థం కోసం వాలంటీర్లను ఇబ్బంది పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వాలంటీర్ల పై కేసులు పెడితే ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని నిలదీశారు. మీ గెలుపు కోసం వాలంటీర్లను బలిపశువులను చేస్తారా? అని అననారు. రాజకీయాల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని, పింఛన్ల విషయంలో వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్న చంద్రబాబు పింఛనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలు అని అన్నారు.
Next Story