Mon Dec 23 2024 04:10:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పెద్దిరెడ్డీ.. నీ కొవ్వు కరిగిస్తా
పుంగనూరు ప్రజలకు ఇవాళే స్వాతంత్ర్యం వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
పుంగనూరు ప్రజలకు ఇవాళే స్వాతంత్ర్యం వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పుంగనూరులో జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే వ్యక్తి.. చల్లా బాబు అని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి.. పెద్దిరెడ్డికి అసలు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ఆధిపత్యానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్ పెడతారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ అయితే పెద్దిరెడ్డికి ఇక నిద్ర పట్టదని, మామిడికాయల కొనుగోలులో కమీషన్లు కొట్టేశారని, ఇసుక, మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదేనని చంద్రబాబు ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం.. అవినీతి చేసి రూ.30 వేల కోట్లు కొట్టేసిందని, పెద్దిరెడ్డి నీ కొవ్వు కరిగిస్తా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ః
కుప్పం తరహాలోనే పుంగనూరును...
పెద్దిరెడ్డి అవినీతిని ప్రశ్నించిన తనపై కేసులు పెట్టించారని చంద్రబాబు అన్నారు. అంగళ్లు ఘటనలో 400 మందిపై కేసులు పెట్టారని, ముద్దులు పెట్టి జగన్ సీఎం అయ్యాడని, తర్వాత బాదుడే బాదుడుఅంటూ ప్రజలపై పన్నుల భారం మోపాడన్నారు. మద్యపాన నిషేధం అన్నాడు.. కానీ ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితికి తెచ్చాడన్నారు. పెంచిన మద్యం ధరల్లో పెద్దిరెడ్డి, జగన్ వాటా ఎంత అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచారని, సంపాదించిన అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తానని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కుప్పంతో సమానంగా పుంగనూరును అభివృద్ధి చేస్తానని, తాను సీఎం అయ్యాక రాజముద్రతో రైతులకు పాస్‌పుస్తకం ఇస్తానని చెప్పారు.
Next Story