Mon Dec 23 2024 13:53:54 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులూ.. ఈ బానిస బతుకేంటి?
పోలీసులు బానిసలుగా బతకొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో ఆయన మూడో రోజు రోడ్డుపైన కూర్చుని ధర్నా చేశారు
పోలీసులు బానిసలుగా బతకొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో ఆయన మూడో రోజు రోడ్డుపైన కూర్చుని ధర్నా చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారంతా దోషులేనని, జగన్ మీటింగ్ పెట్టలేదా? అని ఆయన ప్రశ్నించారు. నీకో రూలా? నాకో రూలా? అని చంద్రబాబు నిలదీశారు. జగన్ రాజమండ్రిలో ఎందుకు మీటింగ్ పెట్టారన్నారు. తన పర్యటనలను కావాలనే అడ్డకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. స్థానిక పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపైనే ఆయన బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు.
తనను అడ్డుకుంటే...
ఇతర ప్రాంతాల వాళ్లు గుడిపల్లికి రాకుండా మూడు మార్గాల్లో అడ్డుకోవడమేంటని చంద్రబాబు నిలదీశారు. పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వహించడం లేదన్నారు. తనను ఇక్కడి నుంచి పంపాలని చూస్తున్నారని, తాను వెళ్లనని, ఇక్కడి నుంచి మిమ్మల్నే పంపుతానని చంద్రబాబు మండి పడ్డారు. పోలీసులకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏం చేయగలరన్నారు. ఎన్ని జైళ్లు, ఎన్ని పోలీస్ స్టేషన్లున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. జీవో నెంబరు ఒకటి చట్టవిరుద్ధమైనదని, దానిని అడ్డం పెట్టి తనను ఆపలేరని ఆయన అన్నారు.
Next Story