Tue Dec 24 2024 00:26:28 GMT+0000 (Coordinated Universal Time)
ఖబడ్డార్ జగన్... మిస్టర్ ఎస్సీ ఎక్కడున్నావ్?
కుప్పం చరిత్రలో ఈరోజు చీకటి రోజు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఆలోచించాలన్నారు
కుప్పం చరిత్రలో ఈరోజు చీకటి రోజు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఈరోజు ఇక్కడి నుంచే ప్రజా రక్షణ పోరాటానికి నాంది పలుకుతున్నానని తెలిపారు. ఖబడ్డార్ జగన్ రెడ్డీ.. ప్రజలు తలచుకుంటే పులివెందులలో దాక్కోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పంలో తనపైనే దాడి చేయడానికి ప్రయత్నించారంటే ఎంతకు తెగించారో అర్థమవుతుందన్నారు. అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేసి పేదలకు అందే భోజనాన్ని వెనక్కు తీసుకున్నారన్నారు. అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అని అన్నారు.
సీఎం చేతిలో పోలీసులు..
మిస్టర్ ఎస్సీ అసలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్నం పెట్టిన చేతిమీదనే దాడి చేస్తారా? అని నిలదీశారు. అరవై లక్షల మంది కార్యకర్తలున్నారని అన్నారు. కోర్టులున్నాయని, పోలీసు వ్యవస్థను దారిలో పెడతానని ఆయన తెలిపారు. పోలీసులను ఆడించేది జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. సీఎం చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేేస్తున్నారని అన్నారు. ఎంతోమంది నాయకులను చూశానని జగన్ లాంటి నీచుడిని తాను చూడలేదని అన్నారు.
ఎంత కండకావరం?
ఎంత మంది వస్తారో కుప్పం రాండి ఇక్కడే తేల్చుకుందామని చంద్రబాబు సవాల్ విసిరారు. రౌడీలను అణిచివేసే పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. తన మీటింగ్ వద్దకు మీ జెండా ఎగరేస్తారా? ఎంత కండకావరం? అని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పంలో గ్రానైట్ ను కొల్లగొడుతున్నారని తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. మాఫియాలాగా మారిందన్నారు. కుప్పంలో ఎప్పుడైనా రౌడీయిజం చూశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అరాచక శక్తులను ప్రజలు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story