Thu Dec 19 2024 19:25:59 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఏపీ సర్వనాశనం చేశారు... దీనిని బాగు చేసుకోవాలంటే?
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పలమనేరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పలమనేరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు సాగునీరు అందించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమయిందన్నారు. ప్రాజెక్టులను వేటినీ ఈప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సబ్సిడీలు కూడా అందడం లేదన్న చంద్రబాబు రైతులను జగన్ నిట్టనిలువునా ముంచేశారని ఆరోపించారు.
సంక్షేమ పథకాలను...
తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రాజెక్టులకు అధిక నిధులను కేటాయించడమే కాకుండా అనేక ప్రాజెక్టులను పూర్తిచేశామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది శాతం పనులను కూడా చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను జగన్ తీసేశారన్నారు. పేదల బతుకుల్లో చీకటి నింపిన జగన్ ను అధికారం నుంచి దించితే తప్ప ఏపీ బాగుపడదని ఆయన అన్నారు. ఇప్పటికే ఏపీ సర్వనాశనమయి పోయిందని చంద్రబాబు అన్నారు.
Next Story