Sun Dec 22 2024 23:38:39 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పెద్ద దోపిడీదారు : చంద్రబాబు
దోపిడిదారు, బందిపోటు జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత ఇసుక ఇచ్చానని తెలిపారు.
దోపిడిదారు, బందిపోటు జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత ఇసుక ఇచ్చానని తెలిపారు. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు జగన్ అని అన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా దుర్మార్గమైందన్నారు. ప్రజల భూములు కొట్టేయడానికి జగన్ సిద్దమయ్యాడన్నారు. ఫ్యానుకు ఊరేయాలని, వైసీపీకి ఉరేయాలని అననారు. కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనది అని చంద్రబాబు అన్నారు. ఉండి, ఏలూరు సభల్లో చంద్రబాబు ప్రసంగించారు.
జగన్ కు ఓటేస్తే...
భవననిర్మాణ కార్మికుల పొట్టకొట్టారన్నారు. మద్యంతో వేలాది కోట్ల రూపాయలు దోచేసాడన్నారు. న్యాయానికి, అన్యాయానికి జరిగే ఎన్నికలు ఇవి అని, మద్యపానం రద్దు చేశాకే ఓట్లు అడుగుతానని జగన్ అన్నారని, జగన్కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి చేశాడా? అని ప్రశ్నించారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగభృతి ఇస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్లు ఇంకా ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. టిడ్కో ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలపై వ్యక్తులపై ఫోటోలు కాదు.. రాజముద్ర వేయిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
Next Story