Mon Dec 23 2024 20:34:59 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులను భారత్ కు రప్పించే ప్రయత్నాలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులను భారత్ కు రప్పించే ప్రయత్నాలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారని, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు తెలుగు వారు అక్కడ చిక్కుకుపోయారన్నారు.
4 వేల మంది విద్యార్థులు...
దాదాపు నాలుగువేల మంది తెలుగు విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారని, వారిని త్వరగా భారత్ కు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు. కీవ్, ఒడెస్సా వంటి పట్టణాల్లో తిండి, నీరు దొరకక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వారికి తక్షణం ఆహార సదుపాయాలను కల్పించాలని కోరారు. కరోనా సమయంలో ఇతర దేశాల నుంచి భారతీయులను తీసుకు వచ్చినట్లే ఇప్పుడు కూడా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకురావాలని కోరారు.
Next Story