Mon Dec 23 2024 07:24:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నెల్లూరుకు చంద్రబాబు
నేడు నెల్లూరుకు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ జోన్-4 ప్రాంతీయ సమావేశం జరగనుంది
నేడు నెల్లూరుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రానున్నారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ జోన్-4 ప్రాంతీయ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నేతలు పాల్గొననున్నారు. వీరితో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల శ్రేణులు, కస్టర్ ఇన్ఛార్జులు కూడా పాల్గొంటున్నారు.
జోనల్ సమావేశంలో...
ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ స్థానాల టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నాయి. రానున్న ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఓటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారధి ప్రక్రియపై శ్రేణులకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. జోనల్, పార్లమెంట్లు వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దయెత్తున పార్టీ శ్రేణులు తరలి వస్తున్నారు.
Next Story