Sun Dec 22 2024 12:07:54 GMT+0000 (Coordinated Universal Time)
రేపు చంద్రబాబు పాదయాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు పాదయాత్ర చేయనున్నారు. ఇరగవరం నుంచి తణుకు వరకూ పన్నెండు కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు పాదయాత్ర చేయనున్నారు. ఇరగవరం నుంచి తణుకు వరకూ పన్నెండు కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా నిలబడేందుకు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో రైతులను కలిసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దానిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి చంద్రబాబు పాదయాత్రను ఎంచుకున్నారు.
తణుకులో ఫ్లెక్సీలు...
అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు స్వాగతం చెబుతూ పార్టీ నేతలు పెద్దయెత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనికి పోటీగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వర్గీయులు కూడా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. జగన్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో టెన్షన్ నెలకొంది. నిన్న రాత్రి నుంచి ఈ ఫ్లెక్సీలు తణుకు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.
Next Story