Mon Mar 24 2025 19:54:07 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి చంద్రబాబు సమీక్షలు
టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల సమీక్ష చేపట్టనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు నియోజకవర్గాల సమీక్ష చేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల సమీక్ష చేపట్టనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు నియోజకవర్గాల సమీక్ష చేయనున్నారు. నియోజకవర్గాల నేతలతో నేరుగా సమావేశమై అక్కడ సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, గుంటూరు తూర్పు ఇన్ ఛార్జులతో చంద్రబాబు నాయుడు నేడు సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీని బలోపేతం...
నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల నుంచి పార్టీ పట్ల వస్తున్న స్పందన తదితర విషయాలను గురించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతం పై తీసుకోవాల్సిన చర్యలను గురించి మాట్లాడనున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలను కూడా పరిష్కరించే దిశగా చంద్రబాబు నియోజకవర్గ సమీక్షలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్పాయి.
Next Story