Mon Dec 23 2024 15:43:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చంద్రబాబుకు షాక్.. విచారణ వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టులో వాయిదా పడింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో విచారణను నవంబరు తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నవంబరు 8వ తేదీకి...
అయితే ఈరోజు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై విచారించిన ధర్మాసనం ఈ కేసును నవంబరు 8 తేదీకి వాయిదా వేసింది. అయితే సిద్ధార్థ లూథ్రా తొమ్మిదో తేదీకి వాయిదా వేయాలని కోరడంతో దానిని తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో 43 రోజుల నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.
Next Story