Mon Jan 13 2025 07:49:36 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ పై
ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈరోజు మధ్యాహ్నం విచారణ జరిపే అవకాశముంది.
క్వాష్ పిటీషన్ పై...
మధ్యాహ్నం జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ఈకేసును విచారించనున్నారు. దీనికి తోడు చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై తీర్పు కూడా సుప్రీంకోర్టు వెలువరించాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ను వెల్లడించే అవకాశముంది. ఈ కేసును ఎవరికి అనుకూలంగా వస్తుంది? వ్యతిరేకంగా వస్తుంది అన్న తేలిన తర్వాత మిగిలిన కేసుల విషయంలో క్లారిటీ రానుంది.
Next Story