Mon Dec 23 2024 16:42:23 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్పై
సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాాబు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరగనుంది
సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాాబు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ బెంచ్ ఈ పిటీషన్ ను విచారించనుంది. ఈరోజు కోర్టు నెంబరు ఆరులో 11వ నెంబరుగా చంద్రబాబు కేసు లిస్ట్ అయింది.
ఫైబర్ నెట్ కేసులో...
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈనెల 28వ తేదీ వరకూ ఆయన బెయిల్ పై ఉంటారు. దీంతో ఈ కేసు విచారణ కూడా వాయిదా పడే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు 17 ఏపై చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలను వినింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ వస్తుందా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Next Story