Thu Nov 21 2024 18:11:05 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ
నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది
నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్లు నేడు విచారణకు రానున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ లభించే అవకాశాలున్నాయని చంద్రబాబు తరుపున న్యాయవాదులు చెబుతున్నారు.
రెండు కేసుల్లో....
మరోవైపు ఈ కేసుల్లో ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని అందువల్ల దీనిపై విచారించాలని సీఐడీ తరుపున న్యాయవాదులు కోరుతున్నారు. ఈరోజు రెండు కీలక కేసుల్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story