Mon Dec 23 2024 07:33:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వాయిదా
సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వాయిదా పడింది. ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది
సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వాయిదా పడింది. ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం, సీఐడీలు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
విచారించిన ధర్మాసనం...
అయితే ఈ కేసును విచారించిన జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కేసును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వచ్చే నెల 16వ తేదీన ఈ కేసును విచారణ చేపడతామని తెలిపింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Next Story