Fri Dec 20 2024 07:42:11 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పై విచారణ
చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ వేసింది
హైకోర్టు తీర్పుపై...
దీనిపై నేడు విచారణ జరగనుండటంతో ఉత్కంఠగా మారింది. ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసు విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ సుప్రీంకోర్టు చంద్రబాబుకు షరతులు విధించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు క్వాష్ పిటీషన్ పై తీర్పు కూడా ఎప్పుడు వెలవడనుందన్నది తెలయకున్నా అదే కీలకంగా మారనుంది. ఆ తీర్పు బయటకు వస్తే మొత్తం కేసులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందా? లేదా? అన్నది తెలియనుంది.
Next Story