Tue Dec 24 2024 02:05:23 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : 10 నుంచి జిల్లాలకు చంద్రబాబు పర్యటనలు షురూ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారయింది. ఈ నెల10వ తేదీ నుంచి ఆయన జిల్లాల పర్యటన కొనసాగుతుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారయింది. ఆయన దాదాపు మూడు నెలల తర్వాత తిరిగి జిల్లాలను పర్యటిస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడకు చేరుకున్న చంద్రబాబు ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు ఇంకా వంద రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటి వరకూ మ్యానిఫేస్టోను విడుదల చేసిన తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. దీంతో ఆయన జిల్లాల పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
శ్రీకాకుళం నుంచి కడప వరకూ...
ఈ నెల పది నుంచి శ్రీకాకుళం నుంచి బయలుదేరి కడపలో 15వ తేదీన తొలి విడత యాత్ర ముగించనున్నారు. 10వ తేదీన శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో ఆయన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారికి ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయని చెబుతున్నారు. పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్ల సంఘం సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొనున్నారని తెలిసింది.
Next Story