Fri Nov 22 2024 18:38:53 GMT+0000 (Coordinated Universal Time)
రేపు విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ రేపు సుప్రీంకోర్టులో విచరణకు రానుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ రేపు సుప్రీంకోర్టులో విచరణకు రానుంది. రేపు సుప్రీంకోర్టులో ఈ కేసును విచారించనున్నారు. తనపై నమోదయిన కేసులన్నీ రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈరోజు లిస్ట్ కాకపోవడంతో తొలుత చంద్రబాబు తరుపున న్యాయవాదులు కొంత ఆందోళనకు గురయ్యారు.
సెలవులు కావడంతో....
అయితే ఆ తర్వాత రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రేపు ఈ క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న టెన్షన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి రెండో తేదీ వరకూ సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో రేపటి విచారణ కీలకంగా మారనుందని వైద్యులు చెబుతున్నారు.
Next Story