Mon Dec 23 2024 06:17:38 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు "నిజం గెలవాలి"
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు శ్రీకాళహస్తి, తిరుపతిలలో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు శ్రీకాళహస్తి, తిరుపతిలలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో ఆమె ప్రజల వద్దకు వెళుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ, కలసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాడాలని ఆమె పిలుపు నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి మూడు లక్షల రూపాయలను అందచేస్తున్నారు.
శ్రీకాళహస్తి, తిరుపతిలో పర్యటన
బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు నారావారిపల్లె నుంచి బయలుదేరి తొట్టెంబేడు మండలం తంగెళ్లపాలెం పంచాయతీ పరిధిలో మరణించిన వెంకటరమణ, కొణతనేరిలో మృతి చెందిన సుధాకర్ నాయుడు, కాసారంలో మరణించిన వెంకట సుబ్బయ్యల కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. సాయంత్రం తిరుపతిలో జరిగే సభలో ఆమె ప్రసంగించనున్నారు.
Next Story