Sun Dec 14 2025 06:16:30 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బెజవాడ ఘటనలపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డయేరియా బారిన పడి ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
కారకులైన అధికారులపై...
ఇందుకు కారకులైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.
Next Story

