Mon Dec 23 2024 05:00:05 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వైసీపీ మ్యానిఫేస్టో మరికాసేపట్లో విడుదలవుతుండగా చంద్రబాబు చేసిన ట్వీట్‌తో
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ మ్యానిఫేస్టో పై ఎక్స్ వేదికగా స్పందించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ మ్యానిఫేస్టో పై ఎక్స్ వేదికగా స్పందించారు. మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్ రెడ్డి.? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావని, వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే... 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివని చంద్రబాబు అన్నారు.
ఎలా అడుగుతావు?
మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు...ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు? అని చంద్రబాబు ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. మరికాసేపట్లో వైసీపీ అధినేత జగన్ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Next Story