Tue Dec 24 2024 02:47:01 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాభి ఇంటికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పట్బాభికి పార్టీకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పట్టాభికి న్యాయపరమైన సాయం పార్టీ చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆందోళన చెందవద్దని న్యాయం గెలుస్తుందని చంద్రబాబు పట్టాభి కుటుంబ సభ్యులతో అన్నారు.
కుటుంబ సభ్యులకు భరోసా...
గన్నవరం ఘటన నేపథ్యంలో పట్టాభిని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం పట్టాభి చేస్తున్న కృషిని మరిచిపొమ్మని, పార్టీ మొత్తం ఆయన వెనకే ఉంటుందని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, అయితే ఇవేమీ న్యాయస్థానాల్లో నిలబడేవి కావని చంద్రబాబు పట్టాభి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినట్లు తెలసింది.
Next Story