Fri Nov 22 2024 23:27:30 GMT+0000 (Coordinated Universal Time)
TDP : దొంగఓట్లతో గెలుద్దామనుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లను చేర్పించారంటూ అధికార వైసీపీపై టీడీపీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది
ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లను చేర్పించారంటూ అధికార వైసీపీపై టీడీపీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా 160 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఫారం 6,7, 8 దరఖాస్తులపై తాము ఇచ్చిన ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఒకే కుటుంబంలోని వ్యక్తుల ఓట్లను వేర్వేరు బూత్ లకు కేటాయించారంటూ ఆయన ఆరోపించారు. దొంగ ఓట్లతోనే గెలుద్దామని వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు.
చనిపోయిన వ్యక్తుల...
చనిపోయిన వ్యక్తుల వివరాలు ఆధారాలతో ఇచ్చినా ఓట్లను తొలగించలేదని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని తెలిపారు. దాదాపు 160 పోలింగ్ కేంద్రాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అనేది లేదని అచ్చెన్నాయుడు మీడియాతో అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లను తొలగించి, అక్రమంగా తొలగించిన ఓట్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story