Tue Apr 01 2025 13:21:56 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఖజానాలో డబ్బుల్లేవ్.. అందుకే పింఛన్లు ఆలస్యం
టీడీపీ వల్లనే పింఛన్లు ఆగిపోయాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని టీడీపీ నేత అచ్చెన్నాయుడు కోరారు

తెలుగుదేశం పార్టీ వల్లనే పింఛన్లు ఆగిపోయాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని టీడీపీ నేత అచ్చెన్నాయుడు కోరారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని, కేవలం రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయన్నారు. జగన్, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిలు కలిసి ఉన్న నిధులన్నింటినీ కాంట్రాక్టర్లకు చెల్లించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అందువల్లనే ఏప్రిల్ నెలలో పింఛన్లు ఆలస్యమవుతున్నాయని, ఇందులో టీడీపీ చేసిందేమీ లేదని ఆయన తెలిపారు. పింఛనుదారులకు ప్రభుత్వమే పింఛను ఇవ్వాలని ఆయన అన్నారు.
టీడీపీపై దుష్ప్రచారం...
ఓటర్లను ప్రభావితం చేస్తారనే వాలంటీర్ల చేత పింఛన్లను పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. అంతే తప్ప టీడీపీ వల్ల కాదన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవస్థ చేత సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తే ఓటర్ల పై ప్రభావం చూపుతుందని ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పక్కన పెట్టాలని చెప్పిందన్నారు. అంతే తప్ప టీడీపీ వల్లనే వాలంటీర్లను పక్కన పెట్టిందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అచ్చెన్నాయుడు అన్నారు. ఇది ప్రజలు నమ్మవద్దని అన్నారు.
Next Story