అవంతి రాసలీలల ఆడియో తప్ప ఒక్క రూపాయి రాలేదు.. మాజీ మంత్రి విసుర్లు
విశాఖకి అదనంగా ఒక్క రూపాయి అయినా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిందా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనతో ఉత్తరాంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఉత్తరాంధ్ర నేతలు ఒకరిపై మరొకరు పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధానిగా ప్రకటించిన తర్వాత అవంతి రాసలీలల ఆడియో విడుదల తప్ప విశాఖకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
విశాఖ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయి అయినా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర కోసం ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదని సీఎం జగన్ రెడ్డిని నిలదీసే ధైర్యం లేని మీకు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుకొచ్చారా? అని అయ్యన్న మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.