Mon Dec 23 2024 07:59:35 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మహిళలకు భద్రత కల్పించాలి : బోండా ఉమ ధర్నా
రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో
విజయవాడ : ఏపీలో ఉన్న మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ బుధవారం విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని, దిశ చట్టం పేరుతో ప్రభుత్వం ఆర్బాటం చేయడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. దిశ చట్టం కింద ఎన్ని కేసులు నమోదు చేశారు ? ఎంతమందికి శిక్షలు వేశారు ? చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేయాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వెంటనే ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా బోండా ఉమ ప్రశ్నించారు. చంద్రబాబు వచ్చిన సమయంలోనే మీరంతా ఎందుకు వచ్చారు? మూడు రోజులపాటు నిద్రపోయారా? బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహించి, మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తే, టీడీపీ నేతలు ధర్నాకు పంపించారని ఆరోపించడం సిగ్గు చేటన్నారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం జరిగితే మొదట స్పందించింది టీడీపీ నేతలేనని, ఆ తర్వాతే వైసీపీ నేతలు వచ్చి ఆసుపత్రి వద్ద హంగామా చేశారు. చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులివ్వడంపై బోండా ఉమ మాట్లాడుతూ.. మాజీ సీఎంకు నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్కు లేదన్నారు.
Next Story