Mon Dec 23 2024 13:48:13 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ నివాసాన్ని ముట్టడిస్తాం
జిల్లాకు వంగవీటి రంగా పేరును పెట్టకపోతే ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని టీడీపీ నేత బొండా ఉమ హెచ్చరించారు
జిల్లాకు వంగవీటి రంగా పేరును పెట్టకపోతే ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని టీడీపీ నేత బొండా ఉమ హెచ్చరించారు. ిజిల్లాల విభజన అశాస్త్రీయంగా చేస్తున్నారన్నారు. తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును. పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ బొండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తలు, వంగవీటి రంగా అభిమానులు తరలి వచ్చారు.
ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు?
అధికారంలో ఉన్న జగన్ ఎవరి అభిప్రాయాలను తీసుకోకుండా జిల్లాల విభజన జగన్ చేస్తున్నారని బొండా ఉమ విమర్శించారు. కొత్త జిల్లాలతో ఉపయోగం లేకపోయినా ప్రజా సమస్యలను పక్కన పెట్టడానికే దీనిని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
రంగా పేరు పెట్టకుంటే...?
మరోవైపు పేర్ల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం వివక్ష పాటిస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల హృదయాల్లో ఉన్న వంగవీటి రంగా పేరును పెట్టడానికి జగన్ కు ఉన్న అభ్యంతరమేమిటో చెప్పాలని బొండా ఉమ నిలదీశారు. కావాలనే రంగా పేరును పక్కన పెట్టినట్లుందన్నారు. దీనిపై జగన్ స్పందించకపోతే ఆయన ఇల్లును ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని బోండా ఉమ హెచ్చరించారు.
Next Story